రెడ్డి సామాజిక వర్గంతో రాజకీయ నియామకాలు

 

విపక్ష నేత యనమల రామకృష్ణుడు
అమరావతి జూలై 15 (globelmedianews.com)
కార్పోరేషన్లు, కమిటీలు అన్నింటిలోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కనిపిస్తున్నారని విపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాజకీయ నియామకాలన్నీ రెడ్డి సామాజిక వర్గంతో నింపేస్తున్నారని శాసనమండలిలో విమర్శించారు. 
రెడ్డి సామాజిక వర్గంతో రాజకీయ నియామకాలు

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరిగిన నియామకాలను చదివి వినిపించారు.  గతంలో తమ ప్రభుత్వాన్ని విమర్శించి.. ఇప్పుడు వారు కూడా అదేపని చేస్తున్నారని అన్నారు. ఇక బడ్జెట్ కు సంబంధించి సాగునీటి రంగానికి గతంలో కంటే మూడువేల కోట్లు తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారని దుయ్యబట్టారు. బీసీ, ఎస్టీలకు నిధులు తగ్గాయని, యువజన సర్వీసులు, ఐటి, పరిశ్రమల శాఖలకు భారీగా నిధుల కోత పడిందని వివరించారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన 6 పథకాలు రద్దు చేశారన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంలు శకుని పాత్ర పోషించాయని యనమల వ్యాఖ్యానించారు.

No comments:
Write comments