పేదల పెన్నిది ముఖ్యమంత్రి కేసీఆర్

 

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
కొల్లాపూర్, జూలై  27, (globelmedianews.com)
కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామములో   గ్రామ సర్పంచ్  మండ్ల కృష్ణయ్య  అధ్యక్షతన పెంచిన ఆసరా పింఛన్స్  ప్రొసీడింగ్ లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,  ఎంపీపీ గాదెల సుధారాణి, జడ్పీటీసీ భాగ్యమ్మ, వైస్ ఎంపీపీ భోజ్యా నాయక్ ,గ్రామ సర్పంచ్ కృష్ణయ్యలు అందజేశారు.  
పేదల పెన్నిది ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం, వారి పెద్ద కొడుకుగా  ముఖ్యమంత్రి కేసీఆర్   రూ. 1000 నుండి 2016, దివ్యాంగుల కొరకు రూ.1500 నుండి 3016 వరకు ఆసరా పింఛన్లు పెంచడం జరిగిందని  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  అన్నారు.  57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఆసరా పించన్లకు దరఖాస్తు చేసుకోవాలి. దళారులను నమ్మొద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందజేస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చించెట్టి సత్య నారాయణ , వార్డ్ నెంబర్లు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,  గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:
Write comments