వోల్వో బస్సు బోల్తా..ప్రయాణికులకు గాయాలు

 

చిత్తూరు, జూలై 19 (globelmedianews.com)
చిత్తూరు జిల్లాలో రేణిగుంట లో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. రాజేష్ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడబోయింది. అయితే అదృష్టవశాత్తు పక్కనే ఉన్న టాటా ఏస్ వాహనంపై పడింది దీంతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 
వోల్వో బస్సు బోల్తా..ప్రయాణికులకు గాయాలు

ప్రయాణికులు ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది రాజేష్ ట్రావెల్స్ కు  చెందిన వోల్వో బస్సు  వైజాగ్ నుంచి బెంగళూరు వెళుతుండగా రేణిగుంట లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా కొట్టడానికి అతివేగమే కారణమని గాయపడ్డ వారు తెలిపారు. 

No comments:
Write comments