కలకలం రేపిన బాలుడి కిడ్నాప్

 

రాజమండ్రి, జూలై 23,(globelmedianews.com):
ప్రశాంతత కు పెట్టింది పేరు మండపేట. ఇక్కడ నివసిస్తున్న వారు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళేందుకు ఇష్ట పడరు. అలాంటి  పట్టణంలో మంగళవారం  కిడ్నాప్ కలవరపాటు కు గురిచేసింది.  శ్రీకాకుళం  జిల్లా  నుంచి వచ్చిన భార్య భర్తలు నూక వెంకట రమణ ది యూనియన్ బ్యాంక్ లో, భార్య బెండీ నాగావళి స్థానిక కెనరా బ్యాంక్ లో అసిస్టెంట్ మనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగేళ్ళ జషిత్ వున్నారు. అప్పటివరకూ నాన్నమ్మతో కలిసి ఆడుకుని ఇంట్లోకి చేరుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఓ అపరిచిత వ్యక్తి నాన్నమ్మపై దాడి చేసి జషీత్ ను ఎత్తుకెళ్లిపోయాడు. కొద్దిదూరం పరుగులు తీసిన పార్వతి పెద్దగా కేకటు వేయడంతో స్థానికులు గుమ గుడారు  విషమం తెలుసుకుని వెంటనే బైపాస్ రోడ్ లో  వెళ్లారు. 
కలకలం రేపిన బాలుడి కిడ్నాప్

మేటారు సైకిల్ వేగంగా ఆలమూరు రోడ్డు వైపుకు  వెళ్లడాన్ని గమనించిన వారు వాహనాన్ని వెంబడించారు. అయితే టోల్ గేట్ వద్ద లారీ అడ్డురావడంతో క్షణాల్లో వారు మాయమయ్యారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారుచిన్నారి కిడ్నాప్ కావడంతో చుట్టుపక్కలవారంతా ఆందోళనకు గురయ్యారు. కిడ్నాప్ విషయంలో జిల్లాలోని అన్ని పోలిస్ స్టేషన్లో ఎలర్ట్ చేసారు. ఆమెను కరెంట్ ఉందా అంటూ ప్రశ్నించాడు. వెను వెంటనే ఆమె పై దాడిచేసి గాయ పర్చాడు. . దీంతో పోలీసులు ఎలార్ట్ అయ్యారు. ప్రతి చోటా జల్లెడ పట్లారు. ఒక్క ప్రాంతాన్ని కూడా వదలకుండా సోదాలు  నిర్వహిస్తున్నారు. రామచంద్రపురం డిఎస్పీ జెవి సంతోష్ నేతృత్వంలో రూరల్  సిఐ మంగాదేవి, రాజేష్ కుమార్. దొరరాజు రెస్యూ ఆపరేషన్ చేపట్టారు. వెంకటరమణకు కుటుంబ పరంగా, వృత్తిపరంగా ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా? ఎవరినుంచైనా బెదిరింపులు వచ్చాయా అనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు. ఆగంతకుడిని గుర్తించడం కోసం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, అపరిచిత వ్యక్తుల సంచారంపై స్థానికులను ఆరా తీస్తున్నారు

No comments:
Write comments