గంట సైలెన్స్ దేనికీ సంకేతం

 

గుంటూరు, జూలై 19, (globelmedianews.com)
భుత్వం ఏదైనా చక్రం తన చేతిలో ఉండేలా రాజకీయ చతురతను ఉపయోగించే ఆయన, ప్రస్తుతం సైలెన్స్ గా వున్నారు. ఆయన మౌనం ఇప్పుడు విపక్షాన్ని సందేహంలో పడేసింది. వైసిపి సర్కార్ ఏర్పడిన వెంటనే అందులోకి దూకేస్తారనుకున్న ఆయన అక్కడ గేట్లు మూసేయడంతో బిజెపి తలుపు తడుతున్నట్లు వార్తలు గుప్పు మన్నాయి. 12 మంది శాసన సభ్యులతో పార్టీని చీల్చేస్తారంటూ పెద్ద ఎత్తునే ప్రచారం సాగింది. ఆ తరువాత సర్దుమణిగింది. ఇంతకి ఆయన ఎవరంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. 
గంట సైలెన్స్ దేనికీ సంకేతం

ఎంతో వాడిగా వేడిగా నడుస్తున్న ఎపి అసెంబ్లీలో గంటా వాయిస్ విన్నదే లేదాయె. మారేందుకు ఇలా.ఏ సభ్యుడికైనా అధికారపక్షం లో కన్నా విపక్షంలోనే రాణించే ఆవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటిది గంటా శ్రీనివాసరావు వంటి సీనియర్ మౌన ముద్రలోనే కాలం గడుపుతున్నారు. అసెంబ్లీకి హాజరుకావడం కూడా ఆయన తక్కువనే చెబుతున్నారు. దాంతో గంటా టిడిపి లో కొనసాగుతారా లేక పార్టీకి రాం రాం చెప్పి బిజెపిలోకి తన శిష్య గణంతో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.ఒక్కడుగా పార్టీ మారడం మొదటి నుంచి అలవాటు లేని గంటా శ్రీనివాసరావు గుంపుగానే పక్క పార్టీలోకి దూకే చరిత్ర కారణంగానే ఆయనవైపు అంతా చూస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ మారేది లేదని చెప్పిన వారే రాత్రికి రాత్రి తట్టాబుట్టా సర్ధేయడం రాజకీయాల్లో రివాజుగా వస్తున్నదే. దాంతో గంటా ఎప్పుడు గంటకొట్టి కాషాయ పార్టీలోకి జంప్ అయ్యేది అన్నది సస్సెన్స్  గానే వుంది. తుఫాన్ ముందు ప్రశాంతత లా ఆయన మౌనం ప్రమాద ఘంటికలు మ్రోగించేదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఏమి జరుగుతుందో చూడాలి.

No comments:
Write comments