పీవీపీకి నాని కౌంటర్

 

విజయవాడ జూలై 16 (globelmedianews.com)
ఎంపీ కేశినేని నాని వర్సెస్ వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్). విజయవాడ సెంటర్‌గా మరో ట్విట్టర్ వార్ మొదలయ్యింది. నిన్నటి వరకు నాని, బుద్దా వెంకన్నల మధ్య జరిగిన వార్.. ఇప్పుడు కేశినేని, పీవీపీల మధ్య మొదలయ్యింది. విజయవాడ ఎంపీకి లీగల్ నోటీసులు పంపిన పొట్లూరి.. ఇది టీజర్ మాత్రమేనంటూ ట్వీట్ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు నోటీసు పంపానని.. సమాధానం చెప్పాలన్నారు. 
పీవీపీకి నాని కౌంటర్

పీవీపీ పంపి నోటీసులు, చేసిన ట్వీట్‌పై కేశినేని నాని కాస్త ఘాటుగానే స్పందించారు. ఒకే ఒక్క డైలాగ్‌తో సమాధానం చెప్పుకొచ్చారు. ఈ ఉడత ఊపుళ్లు చిన్నప్పుడే చూశానంటూ ట్వీట్ చేశారు.నానికి పంపి నోటీసుల్లో పీవీపీ.. తనను నాని ఆర్థిక నేరస్థుడంటూ వ్యాఖ్యలు చేశారని.. నేర స్వభావం కలిగిన వాడినని అసత్య ప్రచారం చేశారన్నారు. జగన్ బ్లాక్ మనీ హవాలా చేశానని నిరాధార ఆరోపణలు చేశారని.. దేశంలోనే కాదు ఎక్కడా తనపై కేసు లేవని పొట్లూరి తెలిపారు. నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా తనపై బురద జల్లారని.. పనామా పేపర్ల లో తన పేరు ఉందన్నారని.. ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి, క్షమాపణలు చెప్పాలని పీవీపీ నోటీసుల్లో ప్రస్తావించారు. 

No comments:
Write comments