విధ్యార్థులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హామీ

 

త్వరలోనే ఆయా గ్రామాలకు బస్సుసౌకర్యం
గద్వాల జూలై 22 (globelmedianews.com)
గద్వాల జిల్లా ధరూర్ మండలం నీళ్లహలి గ్రామాలతో పాటు కేటిదొడ్డి మండలంలోని ఈర్లబండ ఆయా గ్రామాలకు బస్సుసౌకర్యం లేకపోవడంతో బస్సులు నడుపాలంటూ విద్యార్థులు సోమవారం  ఉదయం మైలగడ్డ గ్రామ స్టేజి దగ్గర విద్యార్థులు రోడ్డుపై బైటాయించి ధర్నాలకు దిగ్గారు. రోడ్లపై పలు వాహనాలకు అంతరాయం కలగడంతో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి కు స్థానికులు  పోన్ లో వివరించారు. దాంతో ఎమ్మెల్యే సతీమణి,  బురెడ్డి పల్లి సర్పంచు బండ్ల జ్యోతి  సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో మనోవేదనను అర్థం చేసుకున్నారు. 
 విధ్యార్థులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హామీ

గద్వాల డిఎం తో ఎమ్మెల్యే సతీమణి పోన్ లో మాట్లాడి విద్యార్థుల పడుతున్న బాధలను వివరించారు. ఆయా గ్రామాలకు బస్సులు నడుపాలంటూ డిఎం కు  వివరించారు.  సానుకూలంగా స్పందించిన డిఎం త్వరలోనే ఆయా గ్రామాలకు బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం డిఎం సెలవులో ఉండటంతో విధులకు హాజరైన వెంటనే బస్సులు నడుపుతానన్నారు. బండ్ల జ్యోతి గారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యకు దూరం కావొద్దని  అన్ని గ్రామాలకు బస్సులు నడిచేలా మా వంతుగామేము కృషి చేస్తామని అన్నారు. దాంతో విద్యార్థులు ధర్నా విరమించారు.  ఈ కార్యక్రమంలో ధరూర్ ఎంపీపీ నజ్మూనిసాబేగం, ధరూర్ జడ్పిటిసి పద్మావెంకటేశ్వర్రెడ్డి, వైఎస్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి, కేటిదొడ్డి జడ్పిటిసి రాజశేఖర్, కేటిదొడ్డి ఎస్సై రమణ, నీళహళ్లి సర్పంచు, పాతపాలెం సర్పంచు, తెరాసనాయకులు పాల్గొన్నారు.

No comments:
Write comments