సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలి

 


తెరాస కార్యకర్తలకు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పిలుపు
మహబూబ్ నగర్ జూలై 9 (globelmedianews.com):
నవాబ్ పేట మండలం లోకిరేవు గ్రామంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలి

తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వ్యక్తికి చేరుతున్నాయని ఈ కారణంగానే రాష్ట్రంలోని ప్రతి పౌరుడు తెరాస సభ్యత్వాన్ని తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత తెరాస దేశంలోనే అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా అవతరించనుందని ఆయన తెలిపారు. 

No comments:
Write comments