అవినీతి రహిత ప్రభుత్వం ..నరేంద్ర మోదీకే సాధ్యం:బండారు

 

హైదరాబాద్ జూలై 19 (globelmedianews.com)
సంఘటనా పరువు లో భాగంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖేర్జీ జయంతి నుండి ప్రారంభించిన  బిజెపి సభ్యత్వ అంమోడు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా ముందుకు సాగుతుందని మాజీ కేంద్ర మంత్రి  బండారు దత్తాత్రేయ అన్నారు.  బి జె పి ని ఆదరిస్తూ యువత, మహిళలు, రైతులు బడుగు బలహీన వర్గాల ప్రజలు బిపి  సభ్యత్వం తీసుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అన్నారు. బి జె పి గ్రేటర్ హైదరాబాద్ ఓ బి సి మోర్చా ఆధ్వర్యంలో  వై ఎం సి ఏ నారాయణగూడ, హైదరాబాద్  వద్ద  చేపట్టిన  బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ ఐన బిజెపి డిజిటల్ మెంబర్ షిప్ తో స్వచ్చందంగా సభ్యత్వాన్ని తీసుకుంటున్న ప్రజలను నిజాయితీ గా  నమోదు చేస్తుందని, ఇతర ప్రాంతీయ పార్టీ ల వలె నకిలీ సభ్యత్వం కాదని పేర్కొన్నారు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచే వారందరినీ  బిజెపి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సభ్యులుగా నమోదు చేస్తున్నారని అన్నారు.
అవినీతి రహిత ప్రభుత్వం ..నరేంద్ర మోదీకే సాధ్యం:బండారు

తెలంగాణ ముఖ్య మంత్రి కె చంద్రశేఖర్ రావు నిన్న టి ఆర్ ఎస్ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా  కేవలం దేశ భక్తి సెంటిమెంటు ను రెచ్చగొట్టి ఎన్నికలల్లో గెలుపొందారని అనడం కెసిఆర్ కి మోదీ ఫోబియా ఎంతలా ఉందొ చెప్పకనే చెబుతుంది. నరేంద్ర మోదీ గత ఐదు సంవత్సరాలు తపస్సు చేసి కార్యదక్షతతో దేశ విదేశాలు పర్యటించి ప్రజల్లో విశ్వాసాన్ని కలుగదచేశారని పేర్కొన్నారు.  ఆ విశ్వసనీయత వల్లే మోదీ యొక్క గెలుపు, బిజెపి కి పార్లమెంట్ ఎన్నికల్లో  303  సీట్లు రావడానికి కారణమయ్యింది.  ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వచ్చ్ భరత్ యోజన, ముద్ర యోజన, ఉజ్వల యోజన, భేటీ పడవు భేటీ బచావో  లాంటి అనేక విన్నోత్న సంక్షేమ పథకాల ద్వారా రైతులకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి మరియు యువతకి ఏంటో దెగ్గరయ్యారు.  భారత దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలంటే అది ఒక్క  నరేంద్ర మోదీ గారికే సాధ్యమనే విశ్వసనీయతను కలిగించి గెలుపొందారు.  ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తి అది ఒక ప్రమాదకరమైన సమస్య అని చాటిచెప్పారు.  దేశ యువత లో జాతీయవాద భావాన్ని పెంపొందించి వారి మనసు చూరగొని ఎన్నికల్లో గెలిచారు.  ఇలా నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉత్తర, దక్షిణ, ఈశాన్య భరత్, ఒరిస్సా, బెంగాల్ ఇలా అన్ని ప్రాంతాల్లో విస్తరించింది.బి జె పి ఎదుగుదలని చూసి భయాన్దోలనకు గురై న  ముఖ్య మంత్రి కె సి ఆర్ ఇలాంటి వ్యాఖ్యలతో టి ఆర్ ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కలిగించడానికి మోదీ ప్రతిష్టతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారని,  ఆయన ఇదే భ్రమలో ఉంటె బి జె పి గ్రామా గ్రామాన సభ్యత్వ నమోదు ద్వారా రైతులకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి మరియు యువత ను పెద్ద ఎత్తున ఆకర్షించి తప్పకుండ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ గా మారుతుందని దత్తాత్రేయ జోస్యం చెప్పారు.ప్రజాబలాన్ని పెంచడానికి నరేంద్ర మోదీ ఆకర్షణ శక్తిని మరియు అమిత్ షా వ్యూహ చతురతను సమర్థవంతంగా వినియోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో బలపడతామని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

No comments:
Write comments