నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

 


ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు
కౌతాళం జూలై 06 (globelmedianews.com)
మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శనివారం ఉరుకుంద గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే గెలిచిన మొక్కు తీర్చుకునేందుకు మొదటిసారిగా ఉరుకుంద గ్రామం చేరి నరసింహ స్వామిని మొక్కుబడి చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు మరియు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. 

 నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ఆలయంలో ముఖ ద్వారం దగ్గర మొక్కుబడి కింద టెంకాయలను సమర్పించారు. ఆలయ అర్చకులు స్వాగతం పలుకుతూ ధ్వజ స్తంభం దగ్గర మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయంలో గర్భగుడి లో  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు.పేరు,పేరున కుటుంబ సభ్యుల అర్చనలు చేశారు. తదనంతరం ఆలయ అధికారులు అర్చకులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డీ కి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి  తీర్థప్రసాదములు సమర్పించారు. ఎమ్మెల్యే తో పాటు ఉ వైసిపి నాయకులు కృష్ణంరాజు దేశాయ్ కృష్ణ నాగరాజ్ గౌడ్ మాబు సాబ్ విరూపాక్షప్పా, మాజీ సర్పంచ్, అవతారం, తదితరులు కార్యకర్తలు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

No comments:
Write comments