బీజేపీ వైపు..కొండా దంపతుల చూపు

 

వరంగల్, జూలై 17 (globelmedianews.com)
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా దంపతులు బీజేపీ వైపు చూస్తున్నారా ? వారు త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారనే ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ..పరకాల నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మొలుగూరి బిక్షపతిపై ఆమె నెగ్గారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్త్రీ, శిశు, సంక్షేమం, అభివృద్ధి, వికలాంగులు, జువైనల్ సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 
బీజేపీ వైపు..కొండా దంపతుల చూపు

వైఎస్ జగన్‌కు మద్దుతగా తన శాసనసభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు.ఏపీ విభజన అనంతరం కొండా సురేఖ..భర్తతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రెండు టికెట్లు కేటాయించాలని ఆమె పట్టుబట్టారు. వరంగల్ తూర్పు నుంచి కూతురు సుస్మితా పటేల్‌ను దింపాలని అనుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు తొలి విడత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై అప్పట్లో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాము చేసిన తప్పేంటని టీఆర్ఎస్ అధిష్టాన్ని ఆమె ప్రశ్నించారు.మరోవైపు భూపాలపల్లి నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈయన టీడీపీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారాయన. మరి వీరిద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా ? లేదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

No comments:
Write comments