ఇంటర్ మహిళలకు పొలీస్ వాలంటీర్

 

పత్తికొండ జూలై 29  (globelmedianews.com)
ఇంటర్మీడియట్ లొ ఉత్తీర్ణు లైన మహిళలకు గ్రామ సచివాలయం ద్వారా పంచాయతీ, వార్డులలోని మహిళలకు పోలీసుశాఖ పరంగా సేవలందించేందుకు మహిళా పోలీసు వాలంటీరు(ఎంపీవీ) పోస్టుల నియామకానికి   కర్నూలు ఎస్పీ  ప్రకటన జారీచే నట్లు పత్తకొండ సిఐ నరేష్ అన్నారు సొమవారం అయన మాట్లడుతూ  21 సంవత్సరాల వయస్సు ఉన్న, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఉత్సహ వంతు లైన  మహిళలే ఈ  పోస్టులకు అర్హులని, వారి పై ఎ క్రిమినల్ కేసులు ఉండకూడదని అలాగే ఏ రాజకీయ పార్టీకి  చెందినవారైనా సరె వారిని అనర్హులుగా నిర్ణయి స్తారు  
 ఇంటర్ మహిళలకు పొలీస్ వాలంటీర్

కావున ఆసక్తి గల మహిళల కోసం  దరఖాస్తులు పత్తికొండ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయని అయన తెలిపారు మరియు పూర్తి చేసిన దరఖాస్తును పత్తికొండ పోలీస్ స్టేషన్లలో అందజేయాలి. మౌఖిక పరీక్షలు అనంతరం నియామక ప్రక్రియ పూర్తవుతుంది. పంచాయతీకి ఒక్కరు చెప్పున మహిళా పోలీసు వాలంటీరుని నియమిస్తారన్నారు మహిళా పోలీసు వాలంటీరుగా నియమించబడిన వారికి నెలకు 1000 రూపాయలు గౌరవ వేతనంగా అందజేస్తారు. గ్రామాల్లో బాలికలు, యువతులు, మహిళల పట్ల జరిగే దాడులు అరికట్టి, వారి సమస్యలను ఎంపీవీల ద్వారా నేరుగా పోలీసులు తెలుసుకుని పరిష్కరించడం.జరుగు తుందని  గ్రామాల్లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందా, అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా అనే విషయాలను ఎంపీవీల ద్వారా తెలుసుకుని చర్యలు చేపట్టడం జరుగుతుందని అయన అన్నారు

No comments:
Write comments