డబుల్స్ ఇంటికి ట్రబుల్స్

 

హైద్రాబాద్, జూలై 10, (globelmedianews.com)
తెలంగాణ  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి సికింద్రాబాద్ లో స్థలాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును ఇక్కడ భారీ స్థాయిలో చేపట్టాలని సర్కారు భావించింది. అయితే, ఈ నియోజకవర్గంలో అధిక భాగం రైల్వే భూములే ఉన్నాయి. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ల్యాండ్స్కూడా ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు స్థలాల కోసం సర్కారు వేతికింది. చివరకు  లాలాపేటలో  ఖాళీగా ఉన్న 12.16 ఎకరాల రైల్వే స్థలాన్ని కేటాయించాలని సదరు శాఖను విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆపై లాలాపేటలోనే పేదలు గుడిసెలు వేసుకుంటున్న చోటే వారి స్థలాలను తీసుకుని ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోంది.వాస్తవానికి సికింద్రాబాద్అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా రెండున్న లక్షల జనాభా ఉంటే.. అధిక శాతం  మధ్య తరగతి, పేద ప్రజలు నివాసిస్తున్నారు. 
 డబుల్స్ ఇంటికి ట్రబుల్స్

అది తక్కువ ఆదాయం కలిగిన వారే ఇక్కడ ఉంటున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇక్కడి పేదలకు డబుల్ ఇండ్లు నిర్మంచి ఇచ్చేందుకు సర్కారు ఎక్కువ దృష్టి సారించింది. అయినా సర్కారుకు డబుల్బెడ్ ఇండ్ల ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన స్థలాలు కరువయ్యాయి. ఒక పక్కచూస్తే ఉస్మానియా యూనివర్సిటీ, మరొపక్క చూస్తే రైల్వే ఉంది. ఇందులో అధిక  భాగం రైల్వేకు సంబంధించిన భూములే ఉన్నాయి. రాష్ట్ర సర్కారుకు సంబంధించిన స్థలం ఎక్కడా ఖాళీ లేకుండా పోయింది.ఐతే డబుల్ ఇండ్లకు మిగులు రైల్వే స్థలాలను కేటాయించాలని కేంద్ర రైల్వే శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్కేంద్రం దృష్టికి స్థలాల విషయాన్ని తీసుకెళ్లాడు.  రైల్వే స్థలాలు ఇస్తే అక్కడ ఇండ్లు కట్టించి పేదలకు అందజేస్తామని విజ్ఞప్తి చేశారు. ఇందుకుగాను  సిటీ శివారులో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ భూములు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఫలితంగా ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ఇండ్ల నిర్మాణంలో అనుకుంత మేర ముందుకు సాగడం లేదు.సికింద్రాబాద్ నియోజకర్గానికి చెందిన కంటోన్మెంట్లో నిర్మాణంలో ఉన్న  డబుల్ బెడ్రూమ్ఇండ్లు ఇప్పిస్తామని చాలామంది పేదలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రులే చాలా సందర్భాల్లో వెల్లడించారు. ప్రస్తుతానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో వెయ్యి వరకు ఇండ్లు నిర్మాణంలో ఉన్నవి.సికింద్రాబాద్అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.33.56 కోట్ల వ్యయంతో దోబీఘాట్పేదలకు 216,  ఏసీఎస్నగర్ 48, సుభాష్చంద్రబోస్నగర్ 40, సాయినగర్లో 104 ఇండ్ల నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్ లో నిర్మాణంలో ఉన్న ఇండ్లు 80 శాతం పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. మరో 20 శాతం పనులు మాత్రమే మిగిలున్నట్టు సమాచారం. అయితే ఆయా ఇండ్లలో నిజమైన లబ్ధిదారులకు ఇస్తారా? రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఇండ్లు కేటాయిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

No comments:
Write comments