ఎమ్మెల్యే వనమా, ఆయన కొడుకుపై కేసు

 


భద్రాద్రి కొత్తగూడెం జూలై 2, (globelmedianews.com)
కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఆయన కొడుకు వనమా రాఘవపై కేసు నమోదైంది. తమ డ్యూటీని అడ్డుకున్నారంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం లక్ష్మీదేవిపల్లి స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. శనివారం లోతువాగు బీట్లోని ఇల్లెందు క్రాస్రోడ్డు సమీపంలో అటవీ భూములు కాపాడేందుకు అధికారులు వచ్చారు. 

ఎమ్మెల్యే వనమా, ఆయన కొడుకుపై కేసు

కిలోమీటర్  మేర గోడ కట్టేందుకు రెడీ అవడంతో గిరిజనులు వారిని అడ్డుకున్నారు. కొందరు స్థానిక లీడర్లు విషయాన్ని ఎమ్మెల్యే వనమా దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కొడుకు రాఘవ అక్కడికి వచ్చి అటవీ అధికారులను బెదిరించారు. తీసిన గోతులను ఎమ్మెల్యే సమక్షంలోనే జనం పూడ్చేయడంతో ఆఫీసర్లు పక్కకు తప్పుకున్నారు. ఈ క్రమంలో తమ డ్యూటీకి ఆటంకం కలిగించారని, పనులు చేస్తే సంగతి చూస్తామని ఎమ్మెల్యేతోపాటు ఆయన కొడుకు బెదిరించారంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డం వస్తే తన్నండంటూ ప్రజలను రెచ్చగొట్టేలా ఎమ్మెల్యే వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. కాగా, సోమవారం అటవీ ఆఫీసర్లు గోతులు తవ్వే పనులను మళ్లీ చేపట్టారు.

No comments:
Write comments