ఈఆర్‌సీ చెప్పిన దానికంటే ఎక్కువగా విద్యుత్‌ను కొనుగోలు: జగన్

 

అమరావతి జూలై 19 (globelmedianews.com
తెదేపా హయాంలో ఈఆర్‌సీ చెప్పిన దానికంటే ఎక్కువగా విద్యుత్‌ను కొనుగోలు చేశారని ముఖ్య మంత్రి వైఎస్ జగన్ చెప్పారు. విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) మనకు మార్గదర్శకాలు ఇస్తుందని సీఎం జగన్‌ అన్నారు. శాసనసభలో పీపీఏల అంశంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు.2015-16లో 5 శాతం కొనుగోలు చేయాలని ఈఆర్‌సీ చెబితే దానికంటే ఎక్కువగానే కొన్నారని జగన్‌ విమర్శించారు. 2017-18లో 9 శాతం కొనుగోలు చేయాలంటే 19 శాతం.. 2018-19లో 11 శాతం చేయమంటే 23.4శాతం కొన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిసీ అలా చేయడం మంచి పద్ధతా? అని జగన్‌ ప్రశ్నించారు. 
 ఈఆర్‌సీ చెప్పిన దానికంటే ఎక్కువగా విద్యుత్‌ను కొనుగోలు: జగన్
అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల ఏరకంగా నష్టాలు వస్తాయో వాళ్లకు తెలిసినా ముందుకెళ్లారని తెదేపాను ఉద్దేశిస్తూ ఆయన ఆరోపించారు. పవన విద్యుత్‌ కోసం యూనిట్‌ ఏకంగా రూ.4.84కు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. థర్మల్‌ విద్యుత్‌ రూ.4.20కే వస్తున్నపుడు పవన విద్యుత్‌కు రూ.4.84 ఎందుకు పెట్టాలని జగన్‌ ప్రశ్నించారు. థర్మల్‌ విద్యుత్‌ కొనుగోలు చేయకపోయినా ఫిక్స్‌డ్‌ మొత్తం రూ.1.10 కట్టాల్సి వస్తోందన్నారు. ఈ రెండూ కలిపితే మొత్తం రూ.5.94 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏడాదికి మనం రూ.3,381 కోట్లు నష్టపోతున్నామని సీఎం వివరించారు. 2016 ఏప్రిల్‌లో ఏపీఈఆర్‌సీ చట్టంలో కూడా మార్పులు కావాలని తెదేపా ప్రభుత్వం కోరిందన్నారు. తనకు కావాల్సిన వ్యక్తికోసం అర్హత వయస్సు కూడా పెంచే పరిస్థితి తీసుకొచ్చారని జగన్‌ విమర్శించారు. విద్యుత్‌ కోసం పరిశ్రమలు ఎక్కువ ధర చెల్లించకపోతే వెనక్కిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. డిస్కంలను నష్టాల బాటలో పట్టించిన ఘనత తెదేపా ప్రభుత్వానికే దక్కిందని జగన్‌ దుయ్యబట్టారు.

No comments:
Write comments