రోడ్ పై మురికి నీరు

 


వేములవాడ, జూలై 1, (globelmedianews.com)
కురుస్తున్న వర్షానికి మురికి కాలువలో వుండాలిసిన మురికి నీరు రోడ్ ఎక్కి ప్రవహిస్తున్నాయి.
రాజన్న సిరిసిల్లా జిల్లా, వేములవాడలో కురస్థుస్తున్న వర్షం తో రాజన్న ఆలయం ముందు మురికి నీరు రోడ్ పై ప్రవహిస్తున్నాయి, ఆలయ ముందు ప్రాంతమంతా దుర్గంధ వాసనతో మురికి నీరు అంతా ఒక్క చెరువులా మారింది. రోడ్ ప్రవహిస్తున్న  మురికి నీరు నుండీ ఆలయం లోకి వెళ్ళడానికి భక్తులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. 

రోడ్ పై మురికి నీరు

ఈ చిత్రాని చూసిన భక్తులు ప్రజాప్రతినిధుల పై, అధికారుల పై మండిపడుతున్నారు, తెలంగాణలోనే అతి పెద్ద ఆలయం అయిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో భక్తి భావం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏ చిన్న వర్షం పడినా 30 సంత్సరం నుండి ఇలానే జరుగుతుంది, పాలకుల, అధికారుల దృష్టికి వెళ్లినా నిమ్మకునీరేతిన్నట్లు గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పట్టించుకోని మురికి కాలువలు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు

No comments:
Write comments