ఆనారోగ్య బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి.

 

కోరుట్ల మున్సిపల్ కమీషన్ బి.ప్రభాకర్ రెడ్డి
జగిత్యాల జూలై 29   (globemedianews.com)
పట్టణ ప్రజలు ఆనారోగ్య బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బి.ప్రభాకర్ రెడ్డి కొరారు. సోమవారం   మున్సిపల్ కమిషనర్ బి.ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ కార్మికులతో పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయించి, మురికి కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ స్ర్పె చేయించారు.
ఆనారోగ్య బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి.

రోడ్డుపై నిలిచి ఉన్న వర్షాపు నీరునీ మురికి కాలువలకు దారి మళ్ళీంచారు.ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా పట్టణ ప్రజలు ఆనారోగ్య బారిన పడకుండా ముందుస్తా జాగ్రత్త తీసుకోవాలన్నారు.ప్రతి ఒక్కరు తమతమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మురికినీరు నిలువ కుండా ,నీరు నిల్వ ఉన్న కుండీలు ,టైర్లు ,కూలర్లలో ఉన్న నీటిని తీసేసి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తాలు పాటించాలని, అలాగే మంచి నీటిని వేడి చేసి త్రాగాలని ,ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని  ప్రజలకు కమీషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ వి.రాజయ్య ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Write comments