నెహ్రును మెచ్చకున్న కేసీఆర్

 

హైద్రాబాద్, జూలై 19  (globelemedianews.com)
తెలంగాణ అసెంబ్లీలో మున్సిపల్ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ అనంతరం కీలక ప్రసంగం చేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ.. దేశ తొలి పంచాయతీరాజ్ మంత్రి ఎస్‌కే డే గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. జాతిపిత మహాత్మాగాంధీ స్థానిక స్వపరిపాలన, గ్రామస్వరాజ్యం గురించి ఎంత తపించారో మనకు తెలుసని కేసీఆర్ తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం కేంద్ర మాజీ మంత్రి ఎస్‌కే డే చేసిన కృషిని ఆయన కొనియాడారు. దేశంలో పంచాతీరాజ్ ఉద్యమం ఎలా మొదలైందో కేసీఆర్ మాటల్లోనే.. ‘ఐసన్ హోవర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నెహ్రూ అక్కడికి వెళ్లారు. డిన్నర్ అయిపోయాక హోవర్.. నాటి అమెరికా రూరల్ డెవలప్‌మెంట్ ఇన్‌ఛార్జి ఎస్‌ కే డేను పరిచయం చేశారు. మరుసటి రోజు నెహ్రూ ఎస్‌కే డేను లంచ్‌కి ఆహ్వానించి భారత్ రావాల్సిందిగా కోరారు. 
నెహ్రును మెచ్చకున్న కేసీఆర్

మీలాంటి మేధావి దేశానికి సేవ చేయాలని కోరతారు. దేశం మూర్ఖుల పాలనలో ఉందన్న డే.. నెహ్రూ ప్రతిపాదనను తోసిపుచ్చుతారు. అసలు కారణం ఏంటో చెప్పండి అనగా.. దేశం బాగుపడాలంటే నిర్ణీత పద్ధతి అవలంభించాలి. భారత్‌లో పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. తొలి పంచవర్ష ప్రణాళికలో మీ ప్రాధాన్యాలేంటి..? దేశంలో పరిస్థితి ఏంటని ఆయన నెహ్రూను ప్రశ్నించారు. పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. విదేశీ నిపుణులతో అభివృద్ధి ఎలా సాధ్యం అని డే ప్రశ్నించారు. పేదల కడుపులు నింపాలి, ఆనకట్టలు కట్టి సాగునీరు అందించాలి. ఆహార రంగంలో స్వావలంబన సాధించాలని సూచించారు. తర్వాత నెహ్రూ దేశం వచ్చాక మేధావులు, కేబినెట్‌తో ఎ‌స్.కే. డే చెప్పిన అంశాలను చర్చించారు. అందరూ ఆయన చెప్పింది నిజమేనని అంగీకరించడంతో.. ఎ‌స్.కే. డే సూచనలను అమలు చేశారు. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యాలు మారిపోయాయి. నాగార్జున సాగర్, భాక్రానంగల్, హీరాకుడ్ లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ఈ మార్పులను గమనించిన ఎ‌స్.కే. డే భారత్ తిరిగొచ్చారు. వెంటనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన నెహ్రూ.. కమ్యూనిటీ డెవల‌ప్‌మెంట్ (సీడీ) మంత్రి పదవిని సృష్టించి దాని బాధ్యతలు అప్పగించారు. ఎ‌స్.కే. డే నేరుగా హైదరాబాద్ వచ్చి నెహ్రూ హయాంలోనే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్ఐఆర్డీ)ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నేను కూడా వారం రోజులపాటు శిక్షణ పొందాను. ఇక్కడి నుంచే పంచాయతీ రాజ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నాటి సమితి అధ్యక్షులు, బీడీవోలను సమాజం గౌరవించిన తీరు అద్భుతం’’ అని కేసీఆర్ చెప్పారు. 

No comments:
Write comments