పిచ్చి కుక్కల స్వైర విహారం

 


భద్రాద్రి కొత్తగూడెం జూలై 2, (globelmedianews.com)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైరా విహారం చేసాయి. దమ్మపేట గ్రామంలో పిచ్చి కుక్కలు మంగళవారం  ఉదయాన్నే గ్రామంలో  ఏడుగురు వ్యక్తుల పై ఒక్కసారిగా రెచ్చిపోయి, ప్రజలపై విరుచుకుపడటంతో ఒక్కసారిగా ప్రజలు బయబ్రాంతులకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. కుక్కలు గాయపరిచిన వ్యక్తులను దమ్మపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువెళ్తే మా వద్ద వ్యాక్సిన్ లేదు అశ్వారావుపేట కానీ సత్తుపల్లి కానీ తీసుకువెళ్లండి అంటూ డాక్టర్లు చెప్పడంతో, అశ్వారావుపేటలో హాస్పిటల్ లోవచ్చారు. 

పిచ్చి కుక్కల స్వైర విహారం

అక్కడ కుడా వ్యాక్సిన్ లేదు అని తెలియడంతో దమ్మపేట నుండి సత్తుపల్లి తీసుకువెళ్లారు, సత్తుపల్లి ప్రభుత్వ హాస్పటల్లో కూడా వ్యాక్సిన్ కేవలం  ఏడుగురు కి మాత్రమే ఉండటంతో ప్రమాదం తప్పింది...పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను గాయపరిస్తే కనీసం ప్రభుత్వ హాస్పిటల్ లో వ్యాక్సిన్ లేకపోవడం పట్ల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వర్షకాలం కావడంతో అశ్వారావుపేట, దమ్మపేట, మండలాల్లో రైతుల ఎక్కువగా వుంటారు, రైతులు ఉదయాన్నే పొలంపనులు పై బయటకు వెళుతుంటారు పాము కాటు వెసిన కుక్కలు కరిసిన వ్యాక్సిన్ లేకుండా చేస్తున్న డాక్టర్లు నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం లేకపోలేదు.. ఇప్పటికైనా వ్యాక్సిన్ లు హాస్పిటల్ లో అందుబాటులో ఉంచాలని జిల్లా అధికారులను గ్రామస్థులు కోరుకుంటున్నారు. 

No comments:
Write comments