ముఖేష్ గౌడ్ కన్నుమూత

 

హైదరాబాద్, జూలై 29  (globelmedianews.com)
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్(60) కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన కేన్సర్తో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం రాత్రి 9గంటలకు ఆయన్ను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1959 జూలై 1వ తేదీన ముఖేష్ గౌడ్ జన్మించారు. ముఖేశ్ గౌడ్కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ముఖేష్ గౌడ్ కన్నుమూత

ఇటీవల ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. మహారాజ్ గంజ్, గోషామహల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతితో నగర కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. మాజీ హోం మంత్రి, టీడీపీ నేత దేవేందర్ గౌడ్ కు ముఖేష్ స్వయానా మేనల్లుడు.

No comments:
Write comments