ఏసీబీ వలలో అవినీతి జలగలు

 


మేడ్చల్ జూలై 08 (globelmedianews.com):
మేడ్చల్ కోపరేటివ్ సొసైటీ జిల్లా రిజిస్ట్రార్,అసిస్టెంట్ రిజిస్టర్ లు లంచాలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు. మేడ్చల్ కోపరేటివ్ సొసైటీ జిల్లా రిజిస్ట్రార్ చంద్ర కిరణ్, ,అసిస్టెంట్ రిజిస్టర్ దామోదర్ లపై ఏసీబీ సోదాలు జరిపింది. భూమి రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఒక కేసు వివాదంలో 50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. 

ఏసీబీ వలలో అవినీతి జలగలు

సోమవారం నాడు బాలానగర్ పోలీసు స్టేషన్ పక్క గల పరిశ్రమ లో దామోదర్ పంపించిన వ్యక్తికి ఫిర్యాదు దారుడు భూమి రెడ్డి 20 వేలు లంచం ఇచ్చాడు.  అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆ వ్యక్తిని  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  ఇద్దరు అధికారులను మేడ్చల్ కలెక్టర్ అఫిస్ లో అదుపులోకి తీసుకున్నామని  కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని ఎ సి బి డిఎస్పీ సూర్యనారాయణ  తెలిపారు

No comments:
Write comments