మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం: కుమారస్వామి

 

బెంగళూరు జూలై 25 (globelmedianews.com):
కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత,ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇంటికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా వెళ్లి కలిశారు. అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకురావాలని ఆయనను కుమారస్వామి కోరారు. మన ఎమ్మెల్యేలు వెనక్కి తిరిగి వస్తే బీజేపీ నుంచి మరో ఐదుగురు వస్తారని కుమారస్వామి రామలింగారెడ్డితో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అదే జరిగితే.. 
మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం: కుమారస్వామి

మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం.విశ్వాస పరీక్షలో తనకు మద్దతు తెలిపినందుకు రామలింగారెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కుమారస్వామి భేటీలో రామలింగారెడ్డితో పాటు ఆయన కుమార్తె, ఎమ్మెల్యే సౌమ్య రెడ్డి కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటికీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని కుమారస్వామి భావిస్తున్నట్లు తెలిసింది. రెబల్ ఎమ్మెల్యేల్లో కొందరిని, బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరిని తమ వైపు తిప్పుకుంటే బీజేపీ ఆశలపై నీళ్లు చల్లొచ్చనేది కుమారస్వామి వ్యూహంగా తెలుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలిసింది.

No comments:
Write comments