మంత్రిని పరామర్శించిన దయాకర్ రెడ్డి

 

వనపర్తి జూలై 25 (globelmedianews.com):
మాతృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు కొత్తకోట దయాకర్ రెడ్డి పరామర్శించారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని మంత్రి స్వగృహంలో మంత్రిని కలుసుకున్నారు. 
 మంత్రిని పరామర్శించిన దయాకర్ రెడ్డి

ఈ సందర్భంగా మరణాలు ప్రతి మనిషికి సహజమని, అందులో ప్రధానంగా భగవంతుడు ప్రసాదించిన నూరేళ్ళ ఆయుష్షు కంటే తారక మ్మ 105 ఏళ్లు జీవించడం ఎంతో గమనార్హమని మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాతృమూర్తిని కోల్పోయిన మంత్రి నిరంజన్ రెడ్డి ని ఓదార్చారు.

No comments:
Write comments