కవిత, వినోద్ ఓటమితో కేసీఆర్ పతనం ప్రారంభం

 

త్వరలో బీజేపీలోకి కాంగ్రెస్ , టీఆర్ఎస్ ఎంపీలు: బండారు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 13 (globelmedianews.com
:తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు త్వరలో తమ పార్టీలో చేరబోతున్నారంటూ కేంద్ర మాజీమంత్రి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన దత్తన్న.. మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అభిప్రాయపడ్డారు. కవిత, వినోద్ ఓటమితో కేసీఆర్ పతనం ప్రారంభమైందని చెప్పారు. 
 విత, వినోద్ ఓటమితో కేసీఆర్ పతనం ప్రారంభం

డీఎస్‌తో పాటు చాలామంది నేతలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించారు. తెలంగాణలో రెవెన్యూశాఖతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని దత్తాత్రేయ ఆరోపించారు.దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీకి గత ఎన్నికల్లో సొంతంగా పూర్తి మెజారిటీ రావడంతో ఆకాశమే హద్దుగా రాజకీయాలను శాసిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు. గోవాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో కలిసిపోయారు. ఇక ఏపీ, తెలంగాణలో కూడా ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించే పనిలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:
Write comments