జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

 

ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు నిధులు విడుదల
మంత్రాలయం జూలై 13  (globelmedianews.com)
ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పిలుపుమేరకు శనివారం రాఘవేంద్ర సర్కిల్లో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ పాదయాత్ర సమయంలో లో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వర్లు జగన్ను కలిసి  ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. 
జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

అదికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జగన్ ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకే రాష్ట్ర బడ్జెట్లో యస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రాలయం ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రాఘవేంద్ర కూడలిలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి  జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.జగన్ కు  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ని యోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జానయ్య హనుమన్న అనిల్  రాజు నాగేంధ్ర ,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments