తెలంగాణలో తగ్గుముఖం పట్టిన బ్రేక్ డౌన్లు

 

హైద్రాబాద్, జూలై 6, (globelmedianews.com)
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యుత్ శాఖలో గణనీయమైన మార్పు కన బడుతున్నది. ముఖ్యంగా బ్రేక్ డౌన్ల స్థాయి పూర్తిగా పడి పోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికి నెలకు 5వేల నుంచి 5500 బ్రేక్‌డౌన్లు ఉండేవని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడు 450 నుంచి 500 బ్రేక్ డౌన్లకి పడిపోవడం విశేషం. వ్యవస్థ బలహీనంగా ఉం డటం, నిర్వాహణ లోపం, పురా తన విద్యుత్ స్తంభాలు, తీగల మార్పిడిలో నిర్లక్ష్యం, ట్రా న్స్‌ఫార్మర్లు పెంపు లేక పోవడం, నూతన సబ్‌స్టేషన్ల ఏర్పా టు లేకపోవడంతో విద్యుత్ లోడ్ పెరగడంతో బ్రేక్‌డౌన్లు అధికంగా ఉండేవి.
   తెలంగాణలో తగ్గుముఖం పట్టిన బ్రేక్ డౌన్లు

కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ ర్పాటు తర్వాత క్షేత్రస్థాయిలో మార్పు రావడంతోనే వ్యవస్థ బల పడింది. అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించడం, విద్యుత్ పరికరాలు అందుబాటులో ఉండటంతోనే బ్రేక్ డౌన్లు తగ్గాయి. దీంతో విద్యుత్ నష్టాలు తగ్గా యి. విద్యుత్ వినియోగం అధికంగా వాడుకునే ప్రాం తాలకు అవసరమైన సరఫరా చేస్తే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. నగరంలో సైబర్ సిటీ, బంజారాహిల్స్, సికిం ద్రాబాద్, హాబ్సిగూడలాంటి సర్కిల్లో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. బ్రేక్‌డౌన్లు ఉండటంతో వినియోగం తగ్గుతుంది. రోజుకు 10 యూనిట్లు వినియోగించే వ్యా పారి, బ్రేక్ డౌన్లతో 5 యూనిట్లకు తగ్గడంతో రోజుకు రూ.35ల నష్టాన్ని విద్యుత్ సంస్థ భరించాల్సి ఉంటుంది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి విద్యుత్ అంతరాయాలు లేకుండా రాబడిని పెంచేందుకు కృషి చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం 55 ఎంయూ విద్యుత్ వినియోగం జరుగు తుం ది. దీంతో సంవత్సరానికి రూ.14వేల కోట్ల ఆదాయం వస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవిర్భావించిన తొలి సంవ త్సరంలో 40 ఎంయూ విద్యుత్ వినియోగంతో రూ. 12 వేల కోట్ల ఆదా యం మాత్రమే వచ్చేదని విద్యుత్ రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో విద్యుత్ శాఖాధికారులు తీసుకుంటున్న చర్యలతో ఆదాయం, రెవె న్యూ, వ్యవస్థ పటిష్టం జరుగుతుందని అధికారు లు వివరిస్తున్నారు. విద్యుత్ సరఫరాల్లో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ వచ్చే ప్రాం తాల్లో కవర్డ్ కండెక్టర్, ఎయిర్ బంచుడు కేబుల్, అం డర్‌గ్రౌండ్ కేబుల్‌కు శ్రీకారం చుడుతున్నారు.

No comments:
Write comments