ఛత్తీస్‌గఢ్‌లోఎన్ కౌంటర్... నలుగురు మావోయిస్టుల హతం

 


రాయ్‌పూర్‌ జూలై 6 (globelmedianews.com): 
ఛత్తీస్‌ గఢ్‌ లోని ధంతరి అటవీ ప్రాంతంలో ఎస్టీఎఫ్‌ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు.ఈకాల్పుల్లోనలుగురు మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలోని ఖల్లారి-మెచ్కా గ్రామాల మధ్య ఉన్న అడవుల్లో ఎస్టీఎఫ్‌ బృందం గాలింపు చేపట్టింది.

ఛత్తీస్‌గఢ్‌లోఎన్ కౌంటర్... నలుగురు మావోయిస్టుల హతం

ఈ క్రమంలో కొందరు మావోయిస్టులు భద్రతాసిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన సిబ్బంది నలుగురు మావోయిస్టులను హతమార్చారు. ప్రస్తుతం కాల్పులు ఆగిపోయాయని, హతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారని ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ ఐజీ తెలిపారు. ఘటనాస్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన మావోల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

No comments:
Write comments