ఇక సీటీలో ఈ ఆటోలే

 

హైద్రాబాద్, జూలై 29, (globelmedianews.com
గ్రేటర్ హైదరాబాద్‌లో తర్వలోనే ఈ ఆటో పరుగులు పెట్టనుంది. పెట్రోల్, డీజిల్ ఆధారిత ఆటోలను పూర్తిగా నిలిపివేసి వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆటోలకు మాత్రమే అనుమతినివ్వాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ఎక్కడికక్కడ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మొదట నగర శివారు ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాత పర్మిట్ల అక్రమ దందాకు బ్రేక్ పడుతుందని అంటున్నారు. ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు, ఎలక్ ఆటోలను మాత్రమే అనుమతించేలా ఆంక్షలు విధించాలని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ సూచించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.25 లక్షల ఆటోలు తిరుగుతున్నాయి. మరో 25 వేల ఆటోలు వివిధ జిల్లాల నుంచి అదనంగా వీటికి జత కలిశాయి. 
ఇక సీటీలో ఈ ఆటోలే

వీటిలో 70 శాతం సిఎన్జీ, ఎల్పీజీవినియోగం డిమాండ్ ఉన్నా..తగిన విధంగా ఇంధనం అందుబాటలో లేదు. దీంతో పెట్రోల్, డీజిల్‌పైనే ఆధార పడుతున్నారు. అధికంగా ఆటోలన్నీ డీజిల్‌తో నడవడం మూలానా..కాలుష్యం భయకరంగా పెరుగుతోంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఆటోలు ఫైనాన్షియర్ల అక్రమార్జనకు ఓ మార్గంగా మారిపోయింది. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో తేవడమే అని భావిస్తున్నారు అధికారులు. నాణ్యమైన లిథియం బ్యాటరీతో రూపొందించిన ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 2 లక్షల వరకు ఉంది. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే  వీటిని 50 శాతం నుంచి 60 శాతం వరకు సబ్సిడీపై విక్రయిస్తున్నారు. ఇదే విధమైన పద్ధతి అమలు చేస్తే ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. రూ. లక్షకే ఎలక్ట్రిక్ ఆటో లభించనుంది. ఎలాంటి అప్పులు, ఫైనాన్షియర్ల దోపిడి లేకుండా...పర్మిట్ల అవసరం లేకుండా..వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇది ఆటో డ్రైవర్లకు పెద్దగా భారం కాబోదని..ఒకసారి ఛార్జింగ్ పెడితే..300 కి.మీటర్ల వరకు నడుపొచ్చని అంటున్నారు. 

No comments:
Write comments