యువత ఉపాధికి నైపుణ్య శిక్షణ

 

ఒంగోలు, జూలై 15,(globelmedianews.com):
జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థలద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉఫాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని ప్రాంగణంలో ప్రపంచ యువ నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా రూట్ సిట్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభివచారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో భారతదేశంలో యువతకు చదువుతోపాటు  వృత్తుల పట్ల నైపుణ్యం నేర్చుకోకపోవడం వలన నిరుద్యోగులగా వుంటున్నారన్నారు. 
యువత ఉపాధికి నైపుణ్య శిక్షణ

విద్యార్ధుల డిగ్రీ చదువుతో పాటు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యాన్ని సాధించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పౌష్టికాహరం  లోపం వలన ప్రజలు అనేక ఆనారోగ్యాలకు గురువుతన్నారన్నారు ప్రజలు సహజ సిద్ధింగా ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతంగా  ఉండాలని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంతో  పాటు నియోజకవర్గ కేంద్రాలలో యువతకు శిక్షణ ఇవ్వడానికి నైపుణ్యాభిదృద్ది కేంద్రాలను ఏర్పాటు  చేయడానికి  ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో  రూట్ సెట్ డైరెక్టర్  జి.యస్.మూర్తి, జిల్లా  పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments