అత్యాచార బాధితులకు అండగా వుండాలి

 


మహబూబ్ నగర్  జూలై 08 (globelmedianews.com):
అత్యాచారాలకు, వేధింపులకు గురైన బాలికలు, మహిళల పట్ల సమాజము ముఖ్యంగా మన పోలీసులు గొప్ప ఆదరణ చూపించాల్సిన అవసరం ఉన్నదని ఎస్.పి. రెమా రాజేశ్వరి  అన్నారు. పోలీసు అధికారులు, సఖీ మహిళా సంరక్షణ సంస్థ వారితో సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్.పి. మాట్లాడుతూ  దుర్మార్గులచే వేధించబడి అసహాయ స్థితిలో ఉన్న అమ్మాయిలు, మహిళలకు అండదండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన సఖి సంస్థ చక్కటి వసతులు కలిగి, నిష్ణాతులైన అధికారులతో మన జిల్లా కేంద్రంలో ఉన్నదని అన్నారు.  వీరి సహకారాన్ని తీసుకోవడం వలన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎస్.పి. వివరించారు. అత్యాచారాలతో పాటుగా అమ్మాయిలను మభ్యపెట్టి ఇతర ప్రాంతాలకు తరలించే ముఠాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.  

అత్యాచార బాధితులకు అండగా వుండాలి

మన జిల్లాలో ఇటువంటి సందర్భాలు తక్కువే అయినా, ఆధునిక సమాజపు పోకడలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో బాల్యానికి రక్ష వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాలలు, కళాశాలలు సందర్శిస్తూ, అసభ్యకర  చేష్టల గురించి, బాల్య వివాహాల వలన అనర్థాల గురించి బాలలకు అవగాహన కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇది నిరంతరం కొనసాగాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సఖీ జాతీయ స్థాయి సభ్యురాలు సునీత కృష్ణన్ మాట్లాడుతూ, తమ ప్రమేయం లేకుండానే అత్యాచారానికి గురి కాబడ్డ అభాగ్యులను సమాజం ఆదరించకపోవడం దురదృష్టకరమని, తదుపరి విచారణ పేరుతో మరింత కుంగిపోకుండా సఖి వంటి సంస్థలు పని చేస్తున్నాయని తెలిపారు. పోలీసు శాఖ చేస్తున్న సహకారం వలన ఎందరో అమ్మాయిలు ఊరట పొందుతున్నారని, సఖి సంస్థ ద్వారా మరింత విస్తృతంగా పని చేద్దామని, పోలీసు సహకారాన్ని కోరారు. పోలీసు చేస్తున్న కృషి వలన, మన రాష్ట్రం నుండి అమ్మాయిల తరలింపు చాలావరకు కట్టడి అయిందని, అంతర్గతంగా ఉండే దుర్మార్గపు వ్యవస్థ పట్ల కూడా పోలీసు నిఘా వేయడం వలన ఎంతోమంది అమాయకులు కాపాడబడుతారని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సఖి సంస్థ సభ్యుల ఆలోచనా విధానానికి మద్దతు పలుకుతూ సమన్వయంతో పని చేద్దామని అన్నారు.

No comments:
Write comments