టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం హేయమైన చర్య

 

రాజమహేంద్రవరం జూలై 23 (globelmedianews.com):
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అవతకతవలు, అరాచకాలను అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎత్తి చూపుతున్న తమ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయడం హేయమైన చర్య అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేడెడ్‌ పదవుల్లో రిజరే&్వషన్లు కల్పించే బిల్లుపై టీడీపీ శాసన సభ ఉప నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సీనియర్‌ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సభలో ఈ అంశంపై స్పష్టత కోరారని, దీనికి సమాధానం చెప్పలేక వారిని సభ నుంచి సస్పెండ్‌ చేయడం సరికాదని హితవుపలికారు. 
టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం హేయమైన చర్య

ప్రతిపక్షంగా తమకు ప్రతి విషయం నిలదీసే హక్కు ఉంటుందని, వాటికి సరైన సమాధానాలు చెప్పలేక జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేయడం ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు కొందరు మంత్రులు కూడా ప్రతిపక్ష సభ్యులపై చేస్తున్న పరోక్ష వ్యాఖ్యలు ప్రజాలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి పక్షం అంటే అధికార పార్టీకి ఎందుకంత భయం అని ఎమ్మెల్యే భవానీ ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వలేనని చెప్పిందని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణం కూడా ప్రశ్నార్ధకంగా మారిందని తెలిపారు. విద్యుత్‌ కొనుగోలు అంశంపై జగన్‌ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

No comments:
Write comments