వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి అనిల్

 

నెల్లూరు జూలై 20 (globelmedianews.com)
నగరంలో ని కుసుమ హరిజనవాడ లో వాటర్ ప్లాంట్ ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపి వేమిరెడ్డీ ప్రభాకర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఎంపి వేమిరెడ్డీ మాట్లాడుతూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రజా సమస్యల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనిల్ కు ఐదేళ్లు మంత్రిగా అవకాశం కల్పిస్తారని అన్నారు. 
పేదరికం ఉన్నంతవరకు పెన్షన్లు 

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీలో టిడిపి సభ్యులకు కావలసినంత సమయం స్పీకర్ కల్పిస్తున్నారు..  గతంలో ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు మైక్ ఇచ్చిన సందర్భాలు లేవు. టిడిపి లా మేము వ్యవహరించడం లేదు. అసెంబ్లీలో పరిస్తితులకు ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. పోలవరం లో జరిగిన అక్రమాలను మంత్రుల సబ్ కమిటీ నివేదిక త్వరలోనే వస్తుంది. కాంట్రాక్ట్ ఎంత తక్కువకు కోడ్ అవుతుందో మిగిలిన మొత్తం అవినీతికి నిదర్శనంగా తేలడం ఖాయం. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ విషయం పై స్పష్టత ఇచ్చారని అయన అన్నారు. 

No comments:
Write comments