తెలుగు రాష్ట్రాలకు తప్పని మొట్టికాయలు

 


హైద్రాబాద్, జూలై 4, (globelmedianews.com)
ఎన్నికల్లో డబ్బులు పంచడం భారత్ లో సర్వసాధారణం. ముఖ్యంగా దేశంలోనే ఓటర్లను ప్రలోభపెట్టడంలో తెలుగురాష్ట్రాలు ముందు వరుసలో వుంటూ వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచి అధికారంలో వున్న పార్టీలు ఓటర్లకు నేరుగా డబ్బు అకౌంట్లలో నేరుగా వేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రలోభాల స్థాయి పరాకాష్టకు దారితీయడంతో సామాజిక వేత్త ఒకరు సుప్రీం కోర్టు తలుపు తట్టడం శుభపరిణామమే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సైతం సీరియస్ గానే స్పందించింది.ఎన్నికల్లో డబ్బు పంచడం అనైతికం…. చట్టవిరుద్ధం. అలాంటిది నేరుగా ప్రభుత్వాలే పోలింగ్ ముందు వరకు కూడా ఏదో ఒక పథకం పేరుతో ప్రజలను వంచించాలనుకోవడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులను పట్టికుదిపేస్తుంది.

తెలుగు రాష్ట్రాలకు తప్పని మొట్టికాయలు

దాంతో ప్రముఖ సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు సుప్రీం కోర్టు లో ప్రజాహిత వాజ్యం దాఖలు చేయడం తో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం పేరుతో పోలింగ్ కి ముందు సొమ్ములు పడేలా కార్యాచరణ రూపొందించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా లలో ఇదే తంతు నడిచింది. తమిళనాడులో గతం నుంచి కూడా టివిలు, కుక్కర్లు, గ్రైండర్లు, ల్యాప్ టాప్ లు వంటివి ఇవ్వడం అలవాటుగా మారిపోయింది. ఓటర్లకు ప్రలోభాలు నిరోధించాలిసిన ఎన్నికల సంఘం పోలింగ్ ముందు డబ్బు పంపిణీ చేేసే వారిని పట్టుకుని కేసులు పెడుతుంది తప్ప ప్రభుత్వాలే నేరుగా అకౌంట్లలో వేలకోట్లరూపాయలను బదిలీ చేస్తున్నా నిస్సహాయంగా ఉండిపోతుంది.ఇప్పటివరకు ఇలాంటి వ్యవహారాలపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన వారు ఎవ్వరు లేరు. కానీ ఇప్పుడు సరైన సమయంలో ఎన్నికల ముందు ప్రలోభాలపై వాజ్యం దాఖలు కావడం సుప్రీంకోర్టు స్వీకరించడం ఎలక్షన్ కమిషన్ నుంచి వివిధ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వనున్నాదా అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనివుంది

No comments:
Write comments