గుప్త నిధుల తవ్వకాల దొంగలు అరెస్ట్

 

మంత్రాలయం జూలై 22 (globelmedianews.com)
కర్ణాటక రాష్ట్రంలోని హంపీ క్షేత్రం లోని నవ బృందావనంలో పౌర్ణమి రోజు రాత్రి శ్రీ వ్యాసరాయ తీర్థ బృందావనాన్ని గుప్తనిధుల కోసం ద్వంసం చేసిన దుండగులను కొప్పల్ జిల్లా ఎస్పీ రేణుకా సుకుమార్ ఆధ్వర్యంలోని  బళ్లారి జిల్లా డిజీపి నంజుండ స్వామి, గంగావతి డిఎస్పి బిపి చంద్రశేఖర్లు ఆధ్వర్యంలో పోలీసుల బృందాలు అరెస్టు చేశారు.
గుప్త  నిధుల తవ్వకాల దొంగలు అరెస్ట్

వీరంతా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వారు కావడం గమనార్హం.విలేకర్ల సమావేశంలో కొప్పల్ ఎస్పి  రేణుకా సుకుమార్ దుండగుల వివరాలను విలేకరులకు తెలియజేశారు. మల్లారి మురళి మనోహర్ రెడ్డి, డి మనోహర్, కుమ్మర కేశవ, బి విజయ్ కుమార్, టీ బాల నరసయ్య, వాహనంలో దుండగులు వ్యాసరాయ తీర్థుల  బృందావనాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. పోలీసులు వీరిని అరెస్టు చేశారు. విచారణ జరుగుతోంది

No comments:
Write comments