భర్తతో విభేదాల కారణంగా ఇద్దరు పిల్లలతో ఓ మహిళ ఆత్మహత్య

 

 జగిత్యాల  జూలై 24 (globelmedianews.com):
 జిల్లాలోని మల్యాల మండలం సర్వాపూర్లో విషాదం నెలకొంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ  మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం మల్యాల మండలంలోని సర్వపూర్ గ్రామానికి చెందిన స్వప్న (23)  ఇద్దరు కుమార్తెలు, అహల్యశ్రీ(3), బిన్ను(నాలుగు నెలలు) పిల్లలతో కలసి మంగళవారం ఓ వ్యవసాయ బావి దుకి ఆత్మహత్య చేసుకుంది. 
భర్తతో విభేదాల కారణంగా ఇద్దరు పిల్లలతో ఓ మహిళ ఆత్మహత్య

స్వప్న తన భర్త నరేష్ ల మద్యగత కొంతకాలం నుంచి విబేధాలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలో తన భర్తతో కలసి మల్యాలలో ఓ లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తున్నారు .ఈ క్రమంలో స్వప్న బుధవారం సాయంత్రం మల్యాల లోని తన లేడీస్ ఎంపోరియానికి వెళ్తున్నామని చెప్పి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.రాత్రి అయిన షాపు వద్దకు వెళ్లకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా స్థానికంగా ఉన్న ఓ బావిలో స్వప్న, అహల్యశ్రీ, విన్నుల మృతదేహాలను గురించి వెలికి తీశారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments:
Write comments