మళ్లీ రాజకీయాలకు పవన్ స్మాల్ బ్రేక్

 


హైద్రాబాద్, జూలై 4, (globelmedianews.com)
ఎన్నికల అనంతరం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఓటమికి భయపడి ప్రజాక్షేత్రం నుంచి పారిపోనని సేనలకు భరోసా ఇచ్చారు. తనవెంట ఎందరు ఉంటే అందరితోనే 2024 ఎన్నికలకు సిద్ధం అవుదామని పిలుపునిచ్చారు. గ్రామస్థాయినుంచి జనసేనను బలోపేతం చేసే కార్యక్రమాలను ఆరంభించారు. ఇక పరాజితులందరితో సమీక్షలు సైతం పూర్తి చేశారు. ఇలా వేగంగా అడుగులు వేస్తూ విపక్షానికి పరిమితం అయిన ఒకప్పటి అధికారపార్టీ టిడిపి ని మించిన స్పీడ్ తో దూసుకుపోయారు పవన్.

మళ్లీ రాజకీయాలకు పవన్ స్మాల్ బ్రేక్

ఇంత వేగంగా ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ పార్టీకి మరమ్మత్తులు చేపడతారని సైన్యం ఊహించలేదు. ఓటమి షాక్ తో కొన్నాళ్ళు అజ్ఞాతం లోకి వెళతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అయన గెలుపు ఓటములను సమానంగానే స్వీకరించారు. ఐదేళ్ళుగా పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరచకపోవడాన్ని గుర్తించి ఆ తప్పు సరిదిద్దుకోవడం మొదలు పెట్టారు. అంతా బావుందని జనసేన వర్గాలు భావిస్తుంటే తాజాగా మరోసారి రాజకీయాలకు చిన్న విరామం ప్రకటించారు పవన్ కళ్యాణ్.కొద్ది రోజుల తన అమెరికా పర్యటన తరువాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రకటిస్తా అంటూ అందరికి బై చెప్పేస్తున్నారు. దాంతో జనసేనలో సీరియస్ పాలిటిక్స్ ఉండవన్న విమర్శకులకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు పవన్ కల్యాణ్. చూడాలి ఆయన యుఎస్ టూర్ తరువాత ఎలా వ్యవహరిస్తారో. జనసేనను క్షేత్రస్థాయిలో నిలబెట్టేందుకు పవన్ కల్యాణ‌ సీరియస్ పాలిటిక్స్ చేయాలని ఆయన అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.

No comments:
Write comments