శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలదే ప్రధాన పాత్ర

 

 సిఐ మహేశ్వర రెడ్డి 
ఎమ్మిగనూరు జూలై 19,(globelmedianews.com):
శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలదే ప్రధాన పాత్ర పోషిస్తాయని రూరల్ సిఐ మహేశ్వరరెడ్డి అన్నారు. మండలంలోని కందనాతి గ్రామంలో శుక్రవారం మినీ ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కార్యాలయాన్ని స్విచ్ ఆన్ చేసి సిఐ ప్రారంభించారు. 
శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలదే ప్రధాన పాత్ర

ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్సార్ సర్కిల్ ప్రాంతంలో రెండు కెమెరాలను ఏర్పాటు చేసి అమర్చారు.అనంతరం సిఐ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుళ్లతో సమానమని అన్నారు. నేరాల తగ్గుదలతో పాటు దొంగలను పట్టుకోవడంలో సీసీ కెమోరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. మహిళలపై వేధింపులు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామసుబ్బయ్య, కానిస్టేబుళ్లు కేదారీశ్వరయ్య, నవాజ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments