జనారణ్యంలోకి పాములు

 

మెదక్‌‌, జూలై 26, (globelmedianews.com)
వానాకాలం కావడంతో పొదలు, అడవుల్లో నుంచి జనారణ్యంలోకి వస్తుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు.వర్షాకాలం ప్రారంభమై ఇరవై అయిదు రోజులు కావస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతులు పొలం పనుల్లో బిజీ అవుతున్నారు. మరోవైపు ఇది పాములకు అనువైన కాలం. జూలై, ఆగస్టు నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. బొరియల్లో ఉండే పాములు ఆహారాన్వేషణలో పొలం గట్లు, పొదల వెంట సంచరిస్తుంటాయి. ఇది గమనించక రైతులు, పలువురు పాముకాటుకు గురవుతున్నారు ప్రస్తుతం వానాకాలం సాగు పనులు ముమ్మరంగా సాగుతుండడంతో గ్రామీణ జనం పొలం చెలక పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా జూలై, ఆగస్టు మాసాల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వచ్చి సంచరిస్తాయి. 
 జనారణ్యంలోకి పాములు

బొరియల్లో ఉండే పాములు ఆహారాన్వేషణలో పొలం గట్లు, పొదల వెంట తిరుగుతుండడంతో రైతులు, కూలీలు పాముకాటుకు బలవుతున్నారు. ఒక్క మెదక్ మండల పరిధిలో ఏడాది కాలంలో సుమారు 8 మంది మరణించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. చిన్నశంకరంపేట, శివ్వంపేట మండలాల్లో ఇద్దరు చిన్నారులు పాముకాటుతో కన్నుమూయడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అయితే పాముకాటుకు గురైన వారు వెంటనే దవాఖానకు వెళ్లకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. సకాలంలో మంచి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం ఉండదని, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పాముకాటు చికిత్స ఉందని, తగినన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇళ్లల్లో చెట్ల పొదలు లేకుండా చూసుకోవాలని, ఎలుకలు తిరగకుండా కట్టడి చేయాలని వారు సూచిస్తున్నారు.ఇలా ప్రతి సంవత్సరం పాముకాటుకు బలై మరణిస్తున్నారు. దీనికి అవగాహన లోపమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. పాముకాటుకు గురైన ప్రతి ఒక్కరూ ఆందోళన చెంది నాటు వైద్యం నమ్ముకొని ప్రాణాలు కోల్పోతున్నారు. విషసర్పాల సంఖ్య చాలా తక్కువ. కాటు వేసిన పాము విషపూరితమైందో కాదో ముందు తెలుసుకోవాలి. పాము కాటు వేసిన చోట కట్టు కట్టి దవాఖానకు తీసుకెళ్లాలి. పాములకు అనువైన కాలం జూలై, ఆగస్టు నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలంలో పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. బొరియల్లో ఉండే పాములు ఆహారన్వేషణలో పొలం గట్లు, పొదల వెంట సంచరిస్తుంటాయి. పాము కాటు వేసిన అరగంట లోగా దవాఖానకు తీసుకెళ్తే 99 శాతం బతికే అవకాశం ఉంది. ప్రభుత్వ దవాఖానల్లో మందులు అందుబాటులో ఉంటాయి.

No comments:
Write comments