పార్టీ మారడంలేదు

 

హైదరాబాద్ జూలై 18 (globelmedianews.com
 కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు టాటా చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలోకి వెళ్లరని, వెళితే రాజగోపాల్ రెడ్డి మాత్రమేనని.. త్వరలోనే ఈ చేరిక ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.  చివరకు కోమటిరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఫైనల్గా ఈ చేరిక వ్యవహారంపై కోమటిరెడ్డి తేల్చేశారు. 
పార్టీ మారడంలేదు

తనను బీజేపీ పిలవడం లేదని.. తాను కూడా కాషాయ కండువా కప్పుకోవట్లేదని క్లారిటీగా చెప్పేశారు."నాయకత్వలోపం వల్లే ఎమ్మెల్యేలు పార్టీ మారారు. నాలుగు గోడల మధ్య చాలా సార్లు చెప్పాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పీసీసీ రాజీనామా చేస్తే బాగుండేది. బీజేపీ ప్రత్యామ్నాయం అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. పార్టీ బలంగా ఉన్నా నాయకత్వ లోపం వల్ల కార్యకర్తలు రోడ్డున పడ్డారు. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు.. సమాధానం ఇచ్చాను. యూటర్న్ తీసుకోలేదు.. ప్రస్తుతం నేను కాంగ్రెస్ సభ్యుడిని" అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.

No comments:
Write comments