విశాఖలో అర్ధరాత్రి దారుణం

 


యువతికి నిప్పంటించిన దుండగులు
విశాఖపట్నం జూలై 3, (globelmedianews.com)
సాగర నగరంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. యువతిపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై హత్యాయత్నం చేశారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా యువతిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. మంటలతో రోడ్డుపై కేకలు వేస్తూ పరిగెత్తింది. 

విశాఖలో అర్ధరాత్రి దారుణం

ఆమె అరుపులతో ఘటనాస్థలి నుంచి దుండగులు పరారయ్యారు. స్థానికులు గమనించి మంటలు ఆర్పి కేజీహెచ్‌కు తరలించారు. 60 శాతం శరీరం కాలినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Write comments