జగిత్యాల జిల్లా కలెక్టర్ పై ఎంపీల అనుచిత ఆరోపణలపై

 

టీ ఉద్యోగుల ఐకాస ఆందోళన ప్రదర్శన
జగిత్యాల జూలై 26  (globemedianews.com)
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ కలెక్టర్ గా అవార్డులను అందుకుని ప్రజల సమస్యలు, సంక్షేమంనకు అహర్నిశలు కృష్జి చేస్తున్న జగిత్యాల కలెక్టర్ శరత్ పై ఎంపీలు అర్వింద్, సంజయ్ లు అనుచిత ఆరోపణలు చేయడాన్ని టీ ఉద్యోగుల జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ నిరసిస్తూ భోజనం విరామ సమయంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన  ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛ భారత్ విషయంలో ఎల్ ఈ డి బల్బులు, చెత్త బుట్టలు పంపిణీలో కొందరు సర్పంచ్ లు చెక్ పవర్ పై ఆందోళన విషయంలో పోలీసులు అరెస్ట్ పై ఒత్తిడి తెచ్చాడనే ఆరోపణలను టీ ఉద్యోగ ఐకాస నేతలు ఖండించారు. 
జగిత్యాల జిల్లా కలెక్టర్ పై ఎంపీల అనుచిత ఆరోపణలపై 

కేంద్రం స్వచ్ఛ భారత్ లో నెంబర్ 1 నిలిచిన కలెక్టర్ ను ప్రధాని మోదీ ప్రశంసించారని గుర్తు చేశారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరిత మిషన్ విజయ వంతానికి కృషి చేస్తున్న కలెక్టర్ పై ఆరోపణలు సరి కాదని పేర్కొన్నారు. కలెక్టర్ పై ఎంపీల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలన్నారు.అధికారులను,ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీయొద్దని కోరారు.ఈ కార్య క్రమంలో టీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ భోగ శశిధర్, గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,కో చైర్మన్ ఎండీ వకీల్,తాహసిల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. వెంకటేష్,గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రావు,వివిధ సంఘాల ప్రతినిధులు చెలుకల క్రిష్ణ, సత్యం,శంషాద్దీన్, ఖాదర్, ఆంజనేయులు, ఎలిగేటి రవీందర్, నాగేందర్ రెడ్డి,రాజేందర్ రావు,విజేంధర్,నునవత్ రాజు,శ్రీనివాసరావు, తుకారామ్,తిరుమల రావు,ఆధికారుల,ఉద్యోగుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:
Write comments