సంస్థ పెరిగినా... తప్పని ఇబ్బందులు

 

హైద్రాబాద్, జూలై 9,(globelmedianews.com)
అభివృద్ధి ప్రణాళికలతో హెచ్‌ఎండీఏ అడుగులు వేస్తోంది.మూడేళ్లలో సంస్థ పరిధిలో కీలక అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించారు. మరో వైపు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి గతంలో కంటే ఆరు రెట్లు పెరిగింది. గత 2003లో హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఉన్నప్పుడు విస్తీర్ణం దాదాపు 1,375 కి.మీ. ప్రస్తుతం హెచ్‌ఎండీఏగా ఏర్పడి తర్వాత దాదాపు 7,257 కి.మీ మేర విస్తరించింది. అయితే 2007-08 ఆర్థిక ఏడాదిలో జీవో నెం.570 ప్రకారం హెచ్‌ఎండీఏగా ఏర్పడింది. ఇప్పుడు హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు ఏడు జిల్లాలో పరిధిలో 1,032 గ్రామాలు, 70 మండలాలు, 12 మున్సిపాల్టీలున్నాయి. అయితే 2003లో హెచ్‌ఎండీఏ పరిధి కేవలం 1,375 చ.కీ మేర ఉన్పప్పుడు జీవో నెం.496 ప్రకారం దాదాపు 600 పోస్టులను కేటాయించారు. హుడా నుంచి హెచ్‌ఎండీఏగా మారి పరిధి విస్తరించిన కొత్త పోస్టులు భర్తీ చేయకపోవడంతో అనేక మంది డిప్యూటీ మంది ఆయా శాఖలకు చెందిన అధికారులు డిప్యూటేషన్లపై వచ్చి 'తాము ఆడిందే ఆట..పాడిందే పాట' రీతీలో వ్యవహరిస్తూ హెచ్‌ఎండీఏకు చెడ్డ పేరు తీసుకవస్తున్నారు. 
సంస్థ పెరిగినా... తప్పని ఇబ్బందులు

అయినా ఉన్నతాధికారులు, ప్రభుత్వం జోక్యం కూడా లేకపోవడంతో వాళ్లే తమ హవా కొనసాగిస్తూ..చివరికి అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి జైలు పాలు కావాల్సిన దుస్థితి సైతం ఏర్పడిందిప్రభుత్వ ఆదేశానుసారం విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసిన కమిషనర్ చిరంజీవులు ప్రస్తుతం అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. భవన, లే అవుట్ తదితర నిర్మాణరంగ అనుమతులకు డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా పారదర్శకం చేసి పౌరుల్లో సంస్థ సేవలపై విశ్వాసాన్ని పెంచారు.  సిటీలో టౌన్‌షిప్‌లు, లాజిస్టిక్ పార్కులు, భారీ ఫ్లెఓవర్లు, రవాణా ఆథారిత అభివృద్ధి కేంద్రాలు, గండిపేట సుందరీకరణ, బస్ టెర్మినల్స్, కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ తదితర ప్రాజెక్టులతోపాటుగా సంస్థను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకుగానూ కొత్తగా భూసమీకరణ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు ప్రతాపసింగారం, మేడిపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో భూసమీకరణ పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ల్యాండ్ ఫూలింగ్ స్కీం, భవిష్యత్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిలో ఎక్కువ పథకాలు అమల్లోకి రానున్న తరుణంలో ఇందుకు ప్రత్యేక విభాగాలు అవసరమని కమిషనర్ నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ పరిధి 7,257 స్కేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నది. ఏడు జిల్లాలు, 70 మండలాలు, 1,031 గ్రామాల పరిధిలో సంస్థ సేవలందిస్తున్నది. అడ్మినిస్ట్రేటివ్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు, ఇంజినీరింగ్, ప్లానింగ్, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ, అకౌంట్స్ విభాగాలు ఉన్నాయి. అయితే ఐటీ, లీగల్ సెల్‌కు సంబంధించి ప్రత్యేక వ్యవస్థ లేదు. పూర్తిగా కాంట్రాక్ట్, డిప్యుటేషన్ అధికారులపైనే ఈ రెండు విభాగాలు ఆధారపడి ఉన్నాయి. లీగల్ సెల్, ఐటీ విభాగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సంస్థ పరిధిలోని విభాగాల్లో క్యాడర్ వారీగా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు? ఖాళీలు ఎంత? అన్న అంశాలపై వివరాలు సేకరించారు. విభాగాల వారీగా క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు కసరత్తు చేసి...ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ప్రతి నెల పదుల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్మెంట్‌ అవుతున్నా, కొత్త పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఆయా శాఖల నుంచి అధికారులు డిప్యూటేషన్లపై వస్తున్నారు. దీంతో డిప్యూటేషన్ల వచ్చిన అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు అస్తవ్యస్తం కావడంతో పాటు, అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తుంది. దీనికి డిప్యూటేషన్లపై వచ్చిన అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చిన చర్యలు తీసుకునే పరిస్థితిలో హెచ్‌ఎండీఏకు అధికారం లేకపోవడమే ప్రధాన కారణంగా నిలుస్తుంది. అధికారి మాతృసంస్థకు హెచ్‌ఎండీఏ అధికారులు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మాతృ సంస్థకు చెందిన ఉన్నతాధికారులతో సత్ససంబంధాలు ఉండటంతో మ్యానేజ్‌ చేసుకుని, మళ్లీ హెచ్‌ఎండీఏలో కొనసాగుతున్నారనే విమర్శలున్నాయి. హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌ పురుషోత్తం రెడ్డి తీరే నిదర్శనం. గతంలో ఈయన డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి హెచ్‌ఎండీఏలో ప్లానింగ్‌ విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో జైలు ఊచలు సైతం లెక్కపెడుతున్నాడు. డీటీసీపీ నుంచి రావడంతో అనేకసార్లు పురుషోత్తంరెడ్డి అవినీతి ఆరోపణలు వెలువడినా, హెచ్‌ఎండీఏ అధికా రులు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో చివరికి కథ అలా ముగిసింది. ఇలా హెచ్‌ఎండీఏలో అనేక మంది డిప్యూటే షన్‌పై వచ్చి తమ ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్నారు. 2008-18 వరకు పదేండ్ల కాలంలో దాదాపు 400 మంది వరకు ఉద్యోగులు ఆయా విభాగాల్లో రిటైర్డ్‌ అయ్యారు. అయినా ప్రభుత్వాలు కొత్త పోస్టులను భర్తీ చేయకపో వడంతో హెచ్‌ఎండీఏలో డిప్యూ టేషన్లపై వచ్చే వారితో కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారుతు న్నాయి. టౌన్‌ప్లానింగ్‌లో రిటైర్డ్‌ అయితే డైరెక్టరేట్‌ ఆఫ్‌్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) నుంచి, ఇంజనీరింగ్‌ విభాగంలో రిటైర్ట్‌ అయితే పబ్లిక్‌ హెల్త్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో రిటైర్ట్‌ అయిన ఉద్యోగుల స్థానంలో రెవెన్యూ విభాగం నుంచి అధికారులు వచ్చి తిష్ట వేస్తున్నారు. ఇలా గత దశాబ్ధ కాలంగా హెచ్‌ఎండీఏలో పాలన విషయాల్లో అంతరాయాలు ఏర్పడమే కాకుండా, అవినీతి విచ్చిలవిడిగా పెరిగిపోయిందనే ఆరోపణలున్నాయి.

No comments:
Write comments