వైభోవంగ ముగిసిన వరుణ యాగ మహోత్సవాలు

 

ఎమ్మిగనూరు (globelmedianews.com
 వర్షాలు సమృద్ధిగా కురిసి,రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడాలని వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు. పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీలో గల శ్రీఆంజనేయస్వామి ఆలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న వరుణ యాగం మహోత్సవాలు శనివారం అత్యంత వైభోవంగ ముగిసాయి. చివరి రోజు ఉదయం వేదపారాయణం, నదిజలాభిషేఖం, వరుణమూల మంత్ర పూజ, పూర్ణాహుతి,అగ్నిహోమం,మహామంగళహారతి,కలశఉద్వాసనం,కలశజలప్రోచన తదితర పూజలను నిర్వహించారు.
వైభోవంగ ముగిసిన వరుణ యాగ మహోత్సవాలు

వేద పండితులు,భక్తులు కుండలతో తుంగభద్ర జలాలను తీసుకువచ్చి సహస్ర ఘటాభిషేకాన్ని 1008 జల కలశాలతో శివునికి అభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.వర్షాలు కురిపించే విదంగా కరుణించాలని వేడుకున్నారు. తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉష్ణోగ్రతలు తగ్గి, వర్షాలు సమృద్ధిగా కురిసి,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు.కార్యక్రమంలో చాపమ్మవ్వ,మౌనికా వెంకటేశ్వరరెడ్డి,మహేష్,సత్యారెడ్డి,వేద పండితులు రఘునందనశర్మ,వెంకటరామశర్మ,నాగరాజు,చంద్రశేఖర్,వేణుగోపాల్ రెడ్డి, గజేంద్రారెడ్డి,ఆవుల శ్రీనివాసులు,జలవాడిభాష,రాఘవరెడ్డి,గిడ్డారెడ్డి,ఆవుల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments