గోదావరి పరవళ్లు

 

నిర్మల్, జూలై 23, (globelmedianews.com)
వర్షాకాలం ఆరంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ గోదావరి నదిలో చుక్క నీరు లేక పోవడంతోఎడారిగా తలపిస్తోంది.నిన్న,మొన్న రెండు రోజులుగా కురిసిన వర్షానికి  గోదావరి నది జలకలతో సంతరించుకుంది.గోదావరి నదిలోకి మహారాష్ట్ర బాబ్లీనుండి దిగువ ఉన్న నిర్మల్ జిల్లా బాసర మీదుగా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువప్రాంతమైన మహారాష్ట్ర సర్కార్ తెలంగాణకు గోదావరి నీరు విడుదల కాకుండా బాబ్లీ వద్ద అక్రమప్రాజెక్టులు నిర్మించడంతో ప్రతీ ఏటా దిగువనకు నీరు రాకుండా పోవడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 
గోదావరి పరవళ్లు

సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలమేరకు బాబ్లీ ప్రాజెక్టు నుండి జూన్ నెలలో ఇరు రాష్ట్రల అధికారులు బాబ్లీ గేట్లు ఎత్తినప్పటికి ఎగువన దిగువన గోదావరి నది లో చుక్క నీరు లేకుండా పోయింది. అయితే ఈ సంవత్సరం మహారాష్ట్ర,తెలంగాణ లో సకాలంలో వర్షాలు కురువకపోడంతో గోదావరి పూర్తిగా డెడ్ స్టోరేజ్ కు చేరింది.నిన్న మొన్న కురిసిన వర్షాలకు గోదావరి నది లోకి నీరు వచ్చి చేరడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు,వ్యవసాయ నికి,త్రాగు సాగు నీటి కష్టాలు తొలగిపోయాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.గత రెండు నెలలుగా గోదావరి నదిలో నీరు లేకపోవడంతో  అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు పుష్కర స్నానాలకొరకై వేసవికాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. ప్రస్తుతం గోదావరి నది నీటి మట్టం పెరగడంతో ఇక్కడికి వచ్చే భక్తులు వ్యవసాయదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నాను.

No comments:
Write comments