యదేఛ్చగా కల్తీ నూనెలు

 

నల్గొండ, జూలై 10, (globelmedianews.com)
నల్గొండలో  కల్తీ నూనెలు అమ్ముతున్నారే ఆరోపణలు బాగ్గుమంటున్నాయి. గత సంవత్సరం కూడా కల్తీనూనెను అమ్ముతున్నారని కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేస్తే తనిఖీలు నిర్వహించకుండా  సంబంధిత వ్యాపారులతో ఓ రహస్య ప్రాంతంలో మాట్లాడి వెళ్ళిపోయారనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. మండలంలో కల్తీ నూనెల దందా జోరుగా కొనసాగుతున్నట్లు విశ్వాసనీయసమాచారం. ఇతరపదార్ధాలతో తయారుచేసిన నూనెలను ఆయిల్ ట్యాంకర్ల ద్వారా  తీసుకొచ్చి నాణ్యతలేని డబ్బాలల్లో నింపి బ్రాండెడ్ నూనెల పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం. విడిగా తీసుకొచ్చిన నూనెతో ప్యాకెట్లలో నింపడం వెనుక కల్తీ వ్యాపారం నడుస్తుండటం గమనార్హం. 
యదేఛ్చగా కల్తీ నూనెలు

ఇలాంటి కల్తీ నూనెలను ప్రజలు వంటలకు వాడితే వారి ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కల్తీ నూనెలతో ఆరోగ్యాలు దెబ్బతినడం వలన పలు ఇబ్బందులు ఎదుర్కొవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కల్తీ నూనె టిన్నుల రూపంలో సరఫరా చేస్తున్నారు. ఈ యొక్క నూనెను రోడ్ల ప్రక్కన చిరు వ్యాపారులకు, హోటల్స్‌కు, చిన్నచిన్న ఫంక్షన్‌లకు వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. కల్తీనూనెల్లో పత్తి, వేరుశనగ నూనెలను మిక్సింగ్ చేస్తు అక్రమ దందా వ్యాపారానికి తెరలేపుతున్నారు. అదే విధంగా నిబందనాలకు విరుద్ధుంగా ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున డ్రమ్స్‌లో నిల్వలు ఉంచి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇలాంటి వ్యాపారాలు పట్ల అధికారులు ఎందుకు స్పందించడంలేదు. ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే కల్తీనూనెలపై సంభందిత అధికారుల ఎందుకు దాడులు నిర్వహించడంలేదు అనే మాట ప్రతినోట వినిపిస్తుంది.ప్రభుత్వ అనుమతితో నూనెలు విక్రయించే షాపులు ఎన్ని, వాటి అనుమతులు ఎలా ఉన్నాయి ? అనుమతులు లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కల్తీ వ్యాపారం చేస్తున్న వారిపై అండదండలు ఎక్కడ నుండి ఉన్నాయనే ప్రశ్న చర్చాంశనీయంగా మారుతుంది. ఏది ఏమైనా ప్రజారోగ్యం పట్ల ఇబ్బందికరంగా మారుతున్న కల్తీ నూనెలపై అధికారులు చర్యలు తీసుకుంటే మంచిదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

No comments:
Write comments