కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలోకి వచ్చేసింది: అచ్చెన్నాయుడు ఫైర్

 

అమరావతి జూలై 23 (globelmedianews.com)
ఏపీ అసెంబ్లీ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేసినా, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ ఉదయం బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెన్షన్ కు గురైన ఆయన, మరో ఎమ్మెల్యే బుచ్చెయ్య చౌదరితో కలిసి అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. 
కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలోకి వచ్చేసింది: అచ్చెన్నాయుడు ఫైర్

తాము అనుకున్నదంతా అయిందని, కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలోకి ప్రవేశించిందని ఆరోపించిన ఆయన, ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలపై తాము ఎక్కడ నిలదీస్తామోనన్న భయంతో సభ నుంచి గెంటేశారని అన్నారు.తాము ఇచ్చిన వీడియోలను కూడా సభలో ప్రదర్శించమంటే ఒప్పుకోలేదని, తనను కావాలనే సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. పెన్షన్లపై ప్రశ్నించడమే తన తప్పయిందని, దీనిపై మాట తప్పను - మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ నియంత్రణలో ఉంచుకోలేకపోతున్నారని ఆరోపించారు.

No comments:
Write comments