ఏజెన్సీలో భారీ వర్షాలు

 

విశాఖపట్నం, జూలై  29, (globelmedianews.com)
విశాఖ జిల్లా మన్యంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మండల కేంద్రాలతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.మరోవైపు అన్నదాతల కల నెరవేరింది.చినుకు పడితే నాగలి పెట్టేందుకు అన్నదాతల సిద్ధమ య్యారు.
ఏజెన్సీలో భారీ వర్షాలు

గ్రామీణ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తు న్నాయి.వాగుల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు దుక్కిదున్నుతు న్నారు.ముంచంగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదోర్ గ్రామ సమీపంలోని కల్వర్టు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో 27 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.అలాగే ఒడిశా రాష్ట్రంలోని మూడు పంచాయతీలకు చెందిన 53 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

No comments:
Write comments