మంత్రిని పరామర్శించిన ఈటెల

 

వనపర్తి జూలై 23 (globelmedianews.com):
తల్లిని కోల్పోయిన  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్,   కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా లు మంగళవారం  పరామర్శించారు. ఉదయం పానగల్ లోని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో కలుసుకుని పరిస్థితులను అడిగి  తెలుసుకున్నారు. 
మంత్రిని పరామర్శించిన ఈటెల

మరణం అనేది ప్రతి ఒక్కరికి సహజమైన భగవంతుడు ప్రసాదించిన నూరేళ్ళ ఆయుష్షు కంటే తారకమ్మ 105 సంవత్సరాలు జీవించి పరలోకానికి చేరుకోవడం విచారకరంగా ఉందంటూ వారన్నారు.  లక్షల మందికి ఉపయోగపడే ఒక వజ్రం లాంటి కొడుకు మంత్రి నిరంజన్ రెడ్డి ని తమకు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు. తల్లిని కోల్పోయి ఎంతో బాధగా ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి వారు ఓదార్చారు. 

No comments:
Write comments