భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో అశ్విని ఆసుపత్రి - టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి

 

తిరుమల జూలై 29  (globelmedianews.com -Swamy Naidu)
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం ప్రతి రోజు లక్షలాదిగా విచ్చేసే భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో అశ్వని ఆసుపత్రిని అందుబాటులోనికి తీసుకురానున్నట్లు టిటిడి ఛైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.  టిటిడి ఛైర్మన్ శుక్రవారం తిరుమలలో అశ్విని ఆసుపత్రి, సాలిడ్ వేస్ట్ మేనెజ్మెంట్ ప్లాంట్, డంపింగ్ యార్డ్‌లను అధికారులతో కలిసి తణిఖీ చేశారు.అనంతరం టిటిడి ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం తిరుమల అశ్విని ఆసుపత్రిలో ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రానున్న 3 నెలల కాలంలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురానున్నట్లు తెలిపారు.
భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో అశ్విని ఆసుపత్రి   - టిటిడి ఛైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి

ఇందులో వార్డులు, అత్యవసర సమయాలలో శస్త్రచికిత్స చేసేందుకు అపరేషన్ థియేటరు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తిరుమలలో ప్రతి రోజు  పొగవుతున్న వ్యర్థాలను సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా  తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొడి మరియు తడి వ్యర్థాలు,  డ్రై వ్యర్థాలైన పేపరు, ఫ్లాస్టిక్, గ్లాసు, తదితర వ్యర్థాలు త్వరిత గతిన తొలగించేందుకు యార్డ్ ఏర్పాటు చేసి తొలగించాలన్నారు. అనంతరం డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.  ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే ప్రముఖులకు కేటాయించే విఐపి బ్రేక్ దర్శనంలో ఎల్1, ఎల్ 2, ఎల్3 ల రద్దు మంచి ఫలితాలు సాదించినట్లు తెలిపారు. తద్వార ప్రతి రోజు దాదాపు 2 గంటల సమయం అదనంగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు.   అంతకుముందు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా హెచ్విడిసిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం అశ్విని ఆసుపత్రిలో జరుగుతున్న ఆధునీకరణ పనులు, అపోలో కార్డియాలజి సెంటర్‌ను, అంబులెన్స్‌లను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో టిటిడి ఆరోగ్య విభాగం అధికారి డా.. ఆర్.రామ్ నారాయణ రెడ్డి, అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్లు డా..నర్మద, డా..కుసుమకుమారి, ఇఇ  శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

No comments:
Write comments