ముస్లిం మహిళల రక్షణకు త్రిపుల్ తలాక్ బిల్లు ఎంతో ఉపయుక్తం : నల్లు

 

హైదరాబద్ జూలై 26  (globelmedianews.com)
 త్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో పాస్ కావడం పట్ల బిజెపి రాష్ట్ర శాఖ హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ బిల్లు ముస్లిం మహిళలకు ఒక రక్షణ కవచంలా ఉంటుందని బి జె పి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.ముస్లిం మహిళల వైవాహిక జీవితం క్షణం క్షణం భయం తో గడిపే ఎటువంటి జీవితం నుండి  భరోసా కల్పించే దిశగా ఈ బిల్లు ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించడం ముస్లిం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు.. .
ముస్లిం మహిళల రక్షణకు త్రిపుల్ తలాక్ బిల్లు ఎంతో ఉపయుక్తం : నల్లు

భవిష్యత్తులో ఎంఐఎం పార్టీని మహిళా సమాజం గుణపాఠం చెప్తుందన్నారు.. మహిళల హక్కుల గురించి మాట్లాడాల్సిన ప్రజా ప్రతినిధి వారి హక్కులను కాలరాసే విధంగా లోక్సభలో మాట్లాడడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.. అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడడంలో బిజెపి ఎప్పుడూ ముందు ఉంటుందని, ఏ వర్గానికి ఏ మతానికి త్రిపుల్ తలాక్ బిల్లు వ్యతిరేకం కాదన్నారు. మహిళల హక్కులను కాపాడడానికి తీసుకొచ్చిన బిల్లన్నారు. భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు అన్ని మతాలకు సమానంగా ఉండాలనేది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మహిళల హక్కులను పణంగా పెట్టడం సరైంది కాదు, మహిళా సమానత్వం ప్రధానమైందిగా గుర్తించాలని ఆయన కోరారు.నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్ బిల్లును అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి రాజ్యసభలో ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తారన్న ఆశా బావాన్ని ఆయన వ్యక్తం చేసారు. 

No comments:
Write comments